IPL 2022 RCB vs CSK: లవ్ ప్రపోజల్స్ @ క్రికెట్ స్టేడియమ్స్.. ప్రేమికుల కొత్త వేదిక

IPL 2022 RCB vs CSK: ట్రెండ్ మారింది.. ప్రేమికుల ఆలోచనలూ మారుతున్నాయి.. ఇప్పుడంతా పబ్లిక్.. నలుగురి దృష్టిలో పడాలి. నాలుగు రోజులు అదే టాపిక్ మాట్లాడుకోవాలి.. కొత్తగా ఏదైనా చెయ్యాలి.. అదే నేటి యువత ఫార్మాలిటీ.. నాలుగ్గోడల మధ్య లవ్ ప్రపోజ్ చేస్తే అందులో కిక్కేముంటుంది..
ప్రపంచ దృష్టిని ఆకర్షించాలంటే క్రికెట్ స్టేడియం సరైన వేదిక అనుకుంటున్నారు లవర్స్.. అందుకే అక్కడ మోకాళ్ల మీద నిలబడి తమ లవర్ కి ప్రపోజ్ చేస్తున్నారు.. కెమెరా కన్ను వాళ్ల మీద ఫోకస్ చేసేలా చూసుకుంటున్నారు. ఈ ట్రెండ్ కి ఇదివరకే శ్రీకారం చుట్టినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటున్నాయి.
తాజాగా జరుగుతున్న IPL 2022లో కూడా ఇలాంటి దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. RCB vs CSK మ్యాచ్ సందర్భంగా అమ్మాయి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. ఎంతో క్యూట్ గా ఉన్న వీరి లవ్ ప్రపోజల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. CSK మరియు RCB మధ్య మ్యాచ్ సందర్భంగా, పూణెలోని MCA స్టేడియంలో ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యొక్క ప్రతి ప్రతి సీజన్‌లో అభిమానులు కొత్త విషయాలను చూస్తారు. ఐపీఎల్ 2022 సీజన్‌ను గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ప్రపోజ్ అనంతరం ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ ప్రతిపాదన కెమెరాల్లో కనిపించిన వెంటనే, వారి చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com