IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్తసారథి...

ఐపీఎల్-2023 సీజన్‌కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు సారథి పేరును ప్రకటించింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది. అతడికి డిప్యూటీగా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషభ్ పంత్ కొనసాగుతున్నాడు. అయితే గతేడాది రిషభ్ ఘోర రోడ్డుప్రమాదానికి గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక సిరీస్‌లతో పాటు ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. తాజాగా అతడి స్థానంలో అనువభవజ్ఞుడైన వార్నర్ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించనున్నాడు. కాగా గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా సేవలు అందించిన వార్నర్ 2016లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com