IPL: భారీ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతోన్న ఐపీఎల్.. రూ.50 కోట్లతో..
IPL: మరో భారీ డీల్ కుదుర్చుకునేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతోంది. 2023-28 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం రానున్నది. సుమారు 50 వేల కోట్ల హక్కులు అమ్ముడుపోయినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఐదేండ్ల కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ దాదాపు 60 వేల కోట్లు ఆర్జించే అవకాశమున్నదని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎలరా సెక్యూరిటీస్ అంచనా వేసింది.
భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్, నానాటికీ పెరుగుతున్నదని, ఐపీఎల్ విస్తృతి కారణంగా ఈ డీల్ ద్వారా బీసీసీఐ మరింత సంపన్న బోర్డుగా మారనున్నట్లు సంస్థ అంచనా వేసింది. మే నెలలోనే బీసీసీఐ మీడియా హక్కులకు సంబంధించిన టెండర్ ను విడుదల చేసింది. ఈనెల 12న ఇందుకు సంబంధించిన ఈ-వేలాన్ని నిర్వహించనున్నారు.
ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకోవడానికి బడా కంపెనీలన్నీ క్యూకట్టాయి. ఈ జాబితాలో ప్రస్తుతం బీసీసీఐ అధికారిక ప్రసారదారుగా ఉన్న డిస్నీ స్టార్ తో పాటు సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్, జీ ఎంటర్టైన్మెంట్, అమెజాన్, ఆపిల్, గూగుల్ లు బిడ్స్ వేశాయి. కాగా ఐపీఎల్ మీడియా హక్కుల కోసం కనీస ధర ను బీసీసీఐ 32,890 కోట్లుగా నిర్ణయించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com