రాజస్తాన్‌ టార్గెట్ 162 పరుగులు

రాజస్తాన్‌ టార్గెట్ 162 పరుగులు

ఐపీఎల్‌-2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మొదటి ఓవర్‌లో మొదటి బంతికే పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో జీరో పరుగుకే ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. కాగా ఒక దశలో 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ చివరి 4 ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులే చేయగలిగింది. రాజస్తాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది.

ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడింది ఢిల్లీ. ఇందులో ఐదు మ్యాచ్ లు గెలిచి.. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సీజన్‌ ఆరంభం నుంచి తడబడిన రాజస్థాన్‌ ఏడు మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే విజయ సాధించి పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరచుకోవాలని ఢిల్లీ ఆసక్తిగా ఉంది.

Tags

Next Story