IPL2023: కోహ్లి, గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం..రెచ్చిపోయిన విరాట్

విరాట్ కోహ్లి శివాలెత్తాడు. లక్నోతో బెంగళూరు మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో రెచ్చిపోయాడు. లక్నోకు దెబ్బకు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకున్నాడు. బౌలర్ వికెట్ తీసినపుడు, తాను క్యాచ్ పట్టిన ప్రతీసారి తగ్గేదే లేదంటూ తనలోని ఫైర్‌ను చూపిస్తూ ఉగ్రరూపాన్ని చూపించాడు. తనను ఎవరైనా కవ్వించినా, రెచ్చగొట్టినా తనదైన టైమ్ వచ్చినపుడు ఎలా ఉంటుందో విశ్వరూపాన్నే చూపించాడు. గత నెల 10న బెంగళూరు దాని సొంత గడ్డపై బెంగళూరు జట్టును లక్నో ఓడించింది. ఆ తర్వాత స్టేడియంలో బెంగళూరు ఫ్యాన్స్ వైపు చూస్తూ లక్నో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్.. నోటికి తాళలు వేసుకోమన్నట్లు సైగ చేశాడు. దాన్ని మనసులో పెట్టుకున్న కోహ్లీ.. సోమవారం అంతకు రెండింతలు తిరిగి బదులిచ్చాడు.
రాత్రి లక్నో జట్టును బెంగళూరు ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. అయితే బెంగళూరు గెలుపు బాటలో సాగుతున్నప్పుడు కోహ్లీ రెచ్చిపోయాడు. కృనాల్ క్యాచ్‌ను అందుకున్నపుడు గంభీర్‌లా చేయకూడదంటూ ముద్దు పెడుతున్నట్లు సైగ చేయడమే కాదు.. వికెట్ పడ్డ ప్రతిసారీ సంబరాలను పీక్స్‌కి తీసుకెళ్లాడు. అంపైర్, లక్నో బ్యాట్స్‌మెన్ నవీనుల్‌తో మైదానంలోనే ఘర్షణకు దిగాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కోహ్లి, గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది వారిని విడదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com