IPL2023: ఇంటి బాట పట్టిన కోహ్లీ సేన

IPL2023: ఇంటి బాట పట్టిన కోహ్లీ సేన
ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇంటి దారిపట్టింది. విరాట్‌ కోహ్లీ శతకం వృథా అయింది. కీలక పోరులో బెంగళూరు తడబడింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైంది. దీంతో 8 విజయాలతో ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్‌ మెరుపు శతకంతో గుజరాత్‌కు విజయాన్నిందించాడు. మరోవైపు విజయ్‌ శంకర్‌ 53 పరుగులతో రాణించాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 2, విజయ్‌కుమార్‌ వైశక్‌, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు. పార్నెల్‌ 3.1 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చుకున్నాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్‌ 28 పరుగులు చేశాడు. తొలి వికెట్‌ కి వీరు 67 పరుగులు చేశారు. ఈ క్రమంలో 7.1 ఓవర్ల వద్ద డుప్లెసిస్‌ ఔట్‌ కావడంతో క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్‌ 11 పరుగులు మాత్రమే చేశాడు. లామ్రోర్‌ ఒక పరుగు చేసి ఔట్‌ కావడంతో బెంగళూరు స్కోర్‌ ఒకింత నెమ్మదించింది. అయితే బ్రేస్‌వెల్‌ 26తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు కోహ్లీ. కోహ్లీ ఎడాపెడా ఫోర్లు బాదాడు. మరోవైపు అనుజ్‌ సైతం దాటిగా ఆడడంతో గుజరాత్‌కు బెంగళూరు భారీ స్కోర్‌ను లక్ష్యంగా నిర్దేశించింది. ఇక గుజరాత్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 2, షమీ, దయాల్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌తో ఈ సీజన్‌ లీగ్‌ దశ ముగిసింది. సెంచరీతో చెలరేగిన గిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story