Irfan and Yusuf Pathan : పఠాన్ బ్రదర్స్ పెద్ద మనసు... !

Irfan and Yusuf Pathan : భారత మాజీ క్రికెటర్లు, సోదరులు ఇర్ఫాన్ మరియు యూసుఫ్ పఠాన్ లు కరోనా వేళ పేదలు కడుపులు నింపుతున్నారు. సౌత్ ఢిల్లీలో కరోనా వచ్చి ఇంట్లో ఉండి కోలుకునే వారికి ఉచ్చితంగా భోజనం పంపిణి చేస్తున్నారు. తమ క్రికెట్ అకాడమీ ద్వారా ఈ సాయం చేస్తున్నారు.
ఇప్పటివరకు 90వేల మందికి పైగా బాధితులకి సహాయం చేశారు. వారికి భోజనంతో పాటు రేషన్ సరుకలను అందజేశారు. దేశం కరోనాతో యుద్ధం చేస్తున్న వేళ ఇది తమ బాధ్యత అంటున్నారు ఈ బ్రదర్స్. గత ఏడాది కరోనా సమయంలో నాలుగు వేల మాస్కులను ఉచ్చితంగా అందజేశారు.
కాగా టెస్టు క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి పేసర్ గా ఇర్ఫాన్ రికార్డు సృష్టించాడు. భారత్ తరుపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. ఇక యూసుఫ్ పఠాన్ భారత్ తరుపున 57 వన్డేలు, 22 టీ20 లు ఆడారు. 2007లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో ఇర్ఫాన్, యూసుఫ్ సభ్యులుగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com