Irfan Pathan : రెండోసారి తండ్రైన ఇర్పాన్ పఠాన్..!

Irfan Pathan : రెండోసారి తండ్రైన ఇర్పాన్ పఠాన్..!
X
Irfan Pathan : భారత మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ రెండోసారి తండ్రయ్యాడు. తన సతీమణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పఠాన్ మంగళవారం సోషల్ మీడియాలో వెల్లడించాడు.

Irfan Pathan : భారత మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ రెండోసారి తండ్రయ్యాడు. తన సతీమణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పఠాన్ మంగళవారం సోషల్ మీడియాలో వెల్లడించాడు. తన రెండో కుమారుడికి సులేమాన్‌ ఖాన్‌ అని పేరు పెట్టినట్లుగా పఠాన్ ఈ సందర్భంగా తెలిపాడు. ప్రస్తుతం బిడ్డ మరియు తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. దీనితో పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు పఠాన్ దంపతులకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2016 ఫిబ్రవరిలో హైదరాబాద్ మోడల్ సఫా బేగ్‌ని ఇర్ఫాన్ మక్కాలో వివాహం చేసుకున్నాడు. ఆ సంవత్సరం డిసెంబర్‌లో ఈ జంటకు మొదటి కుమారుడు ఇమ్రాన్ ఖాన్ పఠాన్ జన్మించాడు. ఇక గుజరాత్‌లోని బరోడాకు చెందిన ఇర్ఫాన్‌ 2003లో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. మొత్తం ఇండియా తరుపున 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ- 20లు ఆడాడు. 2012లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఇర్ఫాన్‌ గతేడాది అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.


Tags

Next Story