బుమ్రా పైన ట్రోల్... అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా..!

బుమ్రా పైన ట్రోల్... అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా..!
టీంఇండియా ఫేసర్ జస్ప్రీత్ బుమ్రాను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ బౌలర్.. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు బుమ్రా

టీంఇండియా ఫేసర్ జస్ప్రీత్ బుమ్రాను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ బౌలర్.. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు బుమ్రా.. అయితే ఆ ఫోటోల్లో బాణాసంచా కాల్చడం కనిపించడంతో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 2017లో దీపావళి రోజున బాణాసంచా కాల్చోద్దని కోరిన బుమ్రా.. ఇప్పుడు పెళ్లి రోజున ఎలా అనుమతించాడని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆ బాణాసంచాల్లానే బుమ్రా పైన కామెంట్స్ కూడా గట్టిగానే పేలుతున్నాయి. కాగా ఈ నెల 15వ తేదీన స్పోర్ట్స్ రిపోర్టర్ సంజనా గణేషన్‌తో బుమ్రా వివాహమైన సంగతి తెలిసిందే. అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.


Tags

Read MoreRead Less
Next Story