బుమ్రాతో పెళ్ళంట.. ఇంతకీ ఎవరీ అమ్మాయి..!

బుమ్రాతో పెళ్ళంట.. ఇంతకీ ఎవరీ అమ్మాయి..!
ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్‌ ప్లేస్ లో మరో అమ్మాయి పేరు తెరపైకి వచ్చింది. దీనితో ఎవరీ అమ్మాయిని గూగుల్ లో తెగ సెర్చ్ చేయడం మొదలు పెడుతున్నారు నెటిజన్లు.

టీంఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోబోతునట్టుగా వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ అంటూ ఆ మధ్య రూమర్స్ కూడా వచ్చాయి.


కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బుమ్రా తల్లి క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్‌ ప్లేస్ లో మరో అమ్మాయి పేరు తెరపైకి వచ్చింది. దీనితో ఎవరీ అమ్మాయిని గూగుల్ లో తెగ సెర్చ్ చేయడం మొదలు పెడుతున్నారు నెటిజన్లు.


ఆ అమ్మాయి పేరు సంజన గణేషన్.. వయసు 28 ఏళ్ళు... ఈమె స్పోర్ట్స్ యాంకర్. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేస్తుంది. ఇండియన్ ప్రిమియర్ లీగ్, ఇండియన్ మ్యాచ్ లకి ప్రజెంటర్‌గా వర్క్ చేసిన అనుభవం ఆమెకి ఉంది. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా, 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచింది.


అంతేకాకుండా 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకుంది. ఈమెకి సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.43 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఇన్నిరోజులు పెద్దగా ఎవరికీ తెలియని ఈమె... బుమ్రాతో పెళ్ళంటూ వచ్చిన వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయింది

Tags

Read MoreRead Less
Next Story