Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో వరల్డ్ రికార్డ్.. ఒకే ఓవర్‌లో..

Jasprit Bumrah: భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో 10 స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా.. టీ20 తరహా హిట్టింగ్‌తో చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా నిలిచాడు. స్టువర్ట్‌బ్రాడ్‌కు బుమ్రా చుక్కలు చూపించేశాడు.
బౌన్సర్లతో బుమ్రాని ఇబ్బంది పెట్టాలని బ్రాడ్ ప్రయత్నించగా.. బుమ్రా భారీ షాట్లు ఆడేశాడు. స్టువర్ట్‌బ్రాడ్ ఒకే ఓవర్‌లో ఇచ్చిన 35 పరుగుల్లో.. 29 పరుగులు బుమ్రా చేసినవే. గతంలో లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును అధిగమించాడు. బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ టెస్టు సందర్భంగా 85వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బౌండరీల వరద పారించాడు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com