Jahnavi Mehta: కూతురి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన నటి..

Jahnavi Mehta: కూతురి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన నటి..
Jahnavi Mehta: అన్నింటికంటే ఎక్కువగా ఓ 17 ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా ఎవ్వరినీ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.

Jahnavi Mehta: ఇటీవల 2022 సంవత్సరం కోసం జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో అనేక విషయాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ప్లేయర్‌కు పలికిన ధర దగ్గర నుండి అందులో పాల్గొన్న ఓనర్ల వరకు ప్రేక్షకుల ఫోకస్‌లో ఉన్నారు. అయితే అన్నింటికంటే ఎక్కువగా ఓ 17 ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా ఎవ్వరినీ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. తనే జూహీ చావ్లా కూతురు జాహ్నవి.

షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా ఎప్పటినుండో మంచి స్నేహితులు. అందుకే వారిద్దరు కలిసి ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌కు యజమానులుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈసారి ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో వీరు కాకుండా వీరి వారసులు వచ్చారు. అన్ని టీమ్స్‌కంటే వీరి టీమ్ టేబుల్ దగ్గరే ఎక్కువగా యంగ్‌స్టర్స్ కనిపించారు. అప్పుడే అందరి దృష్టి జూహీ చావ్లా కూతురు జాహ్నవిపై పడింది.

అయితే లైమ్‌లైట్‌లోకి వచ్చిన కూతురు జాహ్నవి గురించి జూహీ చావ్లా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుండి జాహ్నవికి క్రికెట్ అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే 12 ఏళ్ల వయసు నుండి క్రికెటర్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిందట. అంతే కాకుండా క్రికెట్ గురించి మాట్లాడితే జాహ్నవి మొహం వెలిగిపోతుందని చెప్పింది జూహీ చావ్లా.

Tags

Next Story