Kane Williamson: టెస్టుల్లో ఆ టీమ్‌కు భారీ షాక్.. కెప్టెన్‌కే కరోనా..

Kane Williamson: టెస్టుల్లో ఆ టీమ్‌కు భారీ షాక్.. కెప్టెన్‌కే కరోనా..
X
Kane Williamson: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సి ఉండగా.. ఇంతలోనే న్యూజిలాండ్ టీమ్‌కు భారీ షాక్ తగిలింది.

Kane Williamson: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇంతలోనే న్యూజిలాండ్ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. టీమ్ సారథి కేన్ విలియమ్సన్‌‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ టెస్ట్‌కు తాత్కాలికంగా ఓపెనర్ టామ్‌ లాథమ్‌ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ టెస్ట్ న్యూజిలాండ్‌కు కీలకంగా ఉన్న ఈ సమయంలోనే టీమ్‌లోనే బ్యాట్స్‌మన్‌ దూరమవ్వడం టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ లాంటిదే అనుకుంటున్నారు ఫ్యాన్స్.

నాటింగ్‌హమ్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌కు కేన్ దూరం కానున్నాడు. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అవ్వగానే కేన్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు. ఇక తను అయిదు రోజుల పాటు ఐసోలేషన్‌లోనే ఉండనున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఘోర పరాజయం పాలయ్యింది న్యూజిలాండ్. ఇక ఇలాంటి సమయంలో కేన్‌కు కోవిడ్ వచ్చిన విషయాన్ని స్వయంగా టీమ్ హెడ్ కోచ్ బయటపెట్టాడు.

కేన్ విషయంలో తామెంతగానో ఫీలవుతున్నామని.. కరోనా కారణంగా మ్యాచ్‌కు దూరం అవుతుండటం పట్ల అతడు నిరాశ చెందాడని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు. గురువారం కేన్‌కు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహించారు. దీంతో ఈ విషయం బయటపడింది.


Tags

Next Story