Kane Williamson: మగబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్ భార్య.. క్యూట్ పోస్ట్ షేర్..
Kane Williamson: కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ క్రికెటరే అయినా.. ఇండియాలో కూడా తనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ క్రికెటర్‌ను కేన్ మామ అని ప్రేమగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆటగాడిగా ఉన్నాడు కేన్. అంతే కాకుండా ఈ జట్టుకు తనే కెప్టెన్. ఇటీవల తన భార్య డెలివరీ కోసం న్యూజిలాండ్ వెళ్లిన కేన్ మామ.. తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పాడు.
ఐపీఎల్ 2022లో ఎస్ఆర్‌హెచ్ మంచి ఫామ్‌లో ఉంది. అదే సమయంలో కేన్.. తన భార్య డెలివరీ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లాడు. కేన్ విలియమ్సన్, తన భార్య సారాకు ముందుగా 2020లో ఓ కూతురు పుట్టింది. ఇక ఇటీవల కేన్‌కు కొడుకు పుట్టినట్టుగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టాడు.
'కుటుంబంలోకి స్వాగతం లిటిల్ మ్యాన్' అని తన భార్య, పిల్లలతో ఉన్న క్యూట్ ఫోటోను షేర్ చేశాడు కేన్ విలియమ్సన్. ఇక ఎస్ఆర్‌హెచ్‌కు ప్రస్తుతం కెప్టెన్ లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com