Kanpur Test : రేపే న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్.. శ్రేయస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం..!
IND vs NZ : రేపు టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ ఫ్రారంభ కానుంది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్ట్ మ్యాచ్‌కు రెండు జట్లు సిద్దమయ్యాయి. ఇప్పటికే కాన్పూర్ చేరుకున్న భారత్, కివీస్ జట్లు నెట్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. కాగా.. టీమిండియాలోని పలువురు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు తుది జట్టులోకి చోటు కల్పించారు.
భారత్ యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్టులో అతడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ అజింకా రహెన్ ప్రకటించాడు. ఇక.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. పేస్ విభాగంలో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్.. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో టీమిండియా బరిలోకి దిగనుంది.
మరోవైపు టీ-20 సిరీస్ ఓటమితో కసిమీదున్న న్యూజిలాండ్ జట్టు.. టెస్ట్ మ్యాచ్‌తో బరిలోకి దిగుతోంది. భారత్‌ను కచ్చితంగా ఓడించి 33 ఏళ్ల రికార్డును మార్చేస్తామని కివీస్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ ధీమా వ్యక్తం చేశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com