భారీ షాట్స్‌తో చెలరేగిన రాహుల్‌ త్రిపాఠి.. చతికిలపడ్డ చెన్నై

భారీ షాట్స్‌తో చెలరేగిన రాహుల్‌ త్రిపాఠి.. చతికిలపడ్డ చెన్నై
ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.. చెన్నై ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో చెన్నై..

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.. చెన్నై ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్‌ అయింది.. సునీల్‌ నరైన్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ త్రిపాఠి భారీ షాట్స్‌తో చెలరేగిపోయాడు.. మిగిలిన వారంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగినా త్రిపాఠి మాత్రం చివరి దశ వరకు మెరుపులు మెరిపించాడు. 51 బంతుల్లో 81 పరుగులు చేసిన త్రిపాఠి 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. నాలుగో స్థానంలో వచ్చిన సునీల్ నరైన్‌ 17 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. తర్వాత వచ్చిన రసెల్‌, కమిన్స్‌, కార్తీక్‌ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయారు. త్రిపాఠి మెరుపులతో కేకేఆర్‌ 167 పరుగులు చేయగలిగింది.

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్దకు చేరుకోగానే డుప్లెసిస్‌ శివమ్‌ మావి బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చని అంబటి రాయుడు చెలరేగిపోయాడు.. 27 బంతుల్లో 30 పరుగులు చేసి నాగర్‌కోటి బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆతర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కేవలం సామ్‌ కరాన్‌తో కలిసి ధోని ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నంలో 16వ ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ధోని క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కరాన్‌ కూడా వెనుదిరగడంతో సీఎస్‌కే ఒత్తిడికి లోనైంది. ఇదే సమయంలో కేకేఆర్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో క్రీజులో ఉన్న కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజాలు చెన్నైను గెలిపించలేకపోయారు. దీంతో చెన్నై విజయానికి 10 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.

ఇక చెన్నై బౌలర్లలో బ్రేవో 3 వికెట్లు తీయగా.. శార్దూల్‌ ఠాకూర్‌, కరణ్‌ శర్మ,శామ్‌ కర్జన్‌ తలా రెండు వికెట్లు తీశారు. కేకేఆర్‌ బౌలర్లలో శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ తలో వికెట్‌ తీశారు. మొత్తంగా ఈ విజయంతో కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. చెన్నై ఐదో స్థానానికి పడిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story