గెలుపు అంచుల వరకూ వచ్చి చేతులెత్తేసిన కింగ్స్‌ పంజాబ్‌..

గెలుపు అంచుల వరకూ వచ్చి చేతులెత్తేసిన కింగ్స్‌ పంజాబ్‌..
X

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం సాధించింది. KKR నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ ఛేదనలో కింగ్స్‌ పంజాబ్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి చేతులెత్తేసింది. ఉత్కంఠ పోరులో కేవలం 2 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో పరాజయం చవిచూసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 164 పరుగులు చేసింది. . అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కింగ్స్‌ పంజాబ్..నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్ 74, మయాంక్‌ అగర్వాల్‌ 56 లతో రాణించినా మిగతా వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ఇది కేకేఆర్‌కు నాల్గో విజయం కాగా, పంజాబ్‌కు ఆరో ఓటమి.

Tags

Next Story