KL Rahul : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్..!

KL Rahul : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో మైలురాయిని అందుకున్నాడు.. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన భారతీయుడిగా నిలిచాడు. ఇండియన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఈ రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు.
రాహుల్ ఈ రికార్డును 178 ఇన్నింగ్స్‌లో చేరుకోగా, కోహ్లీకి 184 ఇన్నింగ్స్‌లు అవసరం పడ్డాయి. ఓవరాల్‌గా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 162 మ్యాచ్‌లో ఆరు వేల పరుగులు చేసి మొదటిస్థానంలో ఉండగా, ఆ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ 165 మ్యాచ్‌లో ఆరు వేల పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు.
ఆ తర్వాతి స్థానంలో రాహుల్ నిలిచాడు. గత వారం ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన రాహుల్ IPL 2022లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ 7 మ్యాచ్‌ల్లో 265 పరుగులతో ఆరెంజ్ క్యాప్ జాబితాలో టాప్ 5లో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com