KL Rahul : ముంబై బౌలర్లకి చుక్కలు.. రాహుల్ మెరుపు సెంచరీ...!
KL Rahul : ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మెరుపు సెంచరీ చేశాడు. 56 బంతుల్లో సెంచరీ బాదిన రాహుల్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి. ఐపీఎల్ చరిత్రలో రాహుల్ కి ఇది మూడో సెంచరీ కాగా, కెప్టెన్ గా రెండోసారి కావడం విశేషం. ఇక 100వ మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి ఆటగాడు కూడా రాహుల్ కావడం విశేషం. కోహ్లీ తర్వాత కెప్టెన్ గా రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. అటు రాహుల్ సెంచరీ కొట్టడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38), క్వింటన్ డి కాక్ (24) ఫర్వాలేదనిపించారు. ఇక ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ చెరో వికెట్ పడగొట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com