Lalit Modi : నా బయోపిక్ నేనే తీస్తున్నా : లలిత్ మోదీ

Lalit Modi : ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ కుమార్ మోదీపై సినిమా తీయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.. 83, తలైవి వంటి చిత్రాలను నిర్మించిన విష్ణు వర్ధన్ ఇందూరి ఈ బయోపిక్ ని రూపొందిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి.
ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రాసిన మావెరిక్ కమీషనర్ పుస్తకం ఆధారంగా ఈ బయోపిక్ తీస్తున్నట్టుగా సమాచారం. ఐతే తనపై సినిమా తీస్తున్నరన్న వార్తల పైన లలిత్ మోదీ స్పందించారు.
తన ట్విట్టర్ ఖాతాలో లలిత్ కుమార్ మోదీ ట్వీట్ చేస్తూ, " ఏదో ఒక పుస్తకం పేరుతో నాపై సినిమా చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపైన నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటామను.. నా బయోపిక్ నేనే తీస్తున్నాను.. మరికొన్ని వారాల్లో పూర్తి వివరాలు ప్రకటిస్తాను" అని ట్వీట్ చేశాడు లలిత్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎనిమిది ఫ్రాంచైజీలతో 2008లో ప్రారంభించబడింది. ఈ కాన్సెప్ట్‌ను లీగ్ మాజీ ఛైర్మన్ మరియు కమిషనర్ లలిత్ మోడీ ప్రవేశపెట్టారు.
Surprised to see my name associated with some book soon to be a movie. I have NOTHING whatsoever to do with this film or book. I have my own BIOPIC announcement to make in the next few weeks. Time to call my lawyers again 😉 Watch this Space! #lkmbiopic #iplcommissioner #ipl
— Lalit Kumar Modi (@LalitKModi) April 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com