Lasith Malinga: శ్రీలంక లెజెండ్ మలింగ క్రికెట్ నుండి నిష్క్రమణ..

Lasith Malinga: శ్రీలంక లెజెండ్ మలింగ క్రికెట్ నుండి నిష్క్రమణ..
శ్రీలంక క్రికెట్ లెజెండరీ బౌలర్ లషిత్ మలింగ మంగళవారం టి 20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Lasith Malinga: శ్రీలంక క్రికెట్ లెజెండరీ బౌలర్ లషిత్ మలింగ మంగళవారం టి 20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.శ్రీలంక క్రికెట్ లెజెండరీ బౌలర్ లషిత్ మలింగ మంగళవారం టి 20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తద్వారా తన కెరీర్‌ను సమర్థవంతంగా ముగించాడు. అతడు ఇప్పటికే 2011 లో టెస్ట్ నుండి, 2019 లో వన్డేల నుండి రిటైర్ అయ్యాడు.

టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్స్ కూడా మలింగ బౌలింగ్‌ని ఎదుర్కోవడానికి చాలా భయపడేవారు. మలింగ బౌలింగ్ ప్యాటర్న్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. తన ఫాస్ట్ బౌలింగ్‌ని అర్థం చేసుకోలేక ఆటగాళ్ళు చతికిలపడిపోయేవారు. మెరుపు వేగంతో.. తనదైన స్టైల్ లో యార్కర్ సంధించడంలో మలింగ ఎక్స్‌ఫర్ట్. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్స్‌ని ముప్పుతిప్పలు పెట్టె మలింగకి యార్కర్ కింగ్ అనే పేరు కూడా ఉంది.

టీ 20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లు తీసిన మలింగ, ఈ ఏడాది జనవరిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఛాంపియన్స్, ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు.

మలింగ 122 IPL మ్యాచ్‌లు ఆడాడు. 170 వికెట్లు తీసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ సంఖ్యలు 5/13.

38 ఏళ్ల మలింగ 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టి 20 లు ఆడాడు. వరుసగా 101, 338, 107 వికెట్లు తీసుకున్నాడు. 2014లో టి 20 ప్రపంచ కప్ పోటీలో శ్రీలంక టీమ్‌కు నాయకత్వం వహించి విజయానికి కారకుడయ్యాడు.

"నా టి 20 షూలను వేలాడదీయడం అంటే అన్ని రకాల క్రికెట్ మ్యాచ్‌ల నుండి రిటైర్ అవ్వడం అన్నమాట! నా ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో యువ క్రికెటర్లతో నా అనుభవాన్ని పంచుకోవడానికి, వారికి మార్గనిర్దేశం చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని మలింగ ట్వీట్ చేశాడు. ఐపిఎల్ టీమ్ ముంబై ఇండియన్స్‌తో సహా ఆడిన అన్ని ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు తెలిపాడు.

గత సంవత్సరం, అతను 2020 అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్‌లో శ్రీలంకకు నాయకత్వం వహించాలనే కోరికను వ్యక్తం చేశాడు.

"నా షూస్ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ఆటపై నా ప్రేమ ఎప్పటికీ విశ్రాంతిని కోరుకోదు" అని మలింగ నవ్వుతూ వీడియోలో పేర్కొన్నారు.

మలింగ చివరిగా శ్రీలంక తరఫున 2020 మార్చిలో వెస్టిండీస్‌తో జరిగిన టీ 20 లో ఆడాడు.

Tags

Read MoreRead Less
Next Story