MS Dhoni: మోకాళ్ల నొప్పులకు వైద్యం చేయించుకుంటున్న ధోనీ.. డాక్టర్ ఫీజు ఎంతో తెలుసా!!

MS Dhoni: మోకాళ్ల నొప్పులకు వైద్యం చేయించుకుంటున్న ధోనీ.. డాక్టర్ ఫీజు ఎంతో తెలుసా!!
X
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీకి మోకాళ్ల నొప్పులు.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత ఉంది..

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీకి మోకాళ్ల నొప్పులు.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత ఉంది.. అయినా ఆయన తన స్వస్థలం రాంచీలోని స్థానిక ఆయుర్వేద వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.. తనకి రెండు మోకాళ్లలో వస్తున్న నొప్పి గురించి వివరించగా రూ.20లు ఫీజు తీసుకుని రూ.20లు మందులు ఇచ్చారు అక్కడి వైద్యుడు.

మందులను ఇంటికి తీసుకెళ్లడం సాధ్యం కాదని, అందువల్ల ధోని ప్రతి నాలుగు రోజులకు ఒకసారి 70 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి రావల్సి ఉంటుందని వైద్యుడు పేర్కొన్నాడు. ధోనీ తల్లిదండ్రులకు కూడా ఇక్కడే చికిత్స చేయించుకుంటారు. వైద్యుడు బంధన్ సింగ్ ఖార్వార్‌ ఓ చెట్టుకింద టార్పాలిన్ టెంట్‌ వేసుకుని కూర్చుంటారు. గత 30 ఏళ్లుగా తన దగ్గరకు వచ్చే రోగులకు చికిత్స అందిస్తున్నారు.

ఎంఎస్ ధోని వైద్యశాలను సందర్శించినప్పుడు బంధన్ సింగ్‌కి ధోనీ గురించి తెలియదు. ధోనీని చూసి పిల్లలు కారు చుట్టూ తిరుగుతూ, అతనితో ఫోటోలు దిగడాన్ని బంధన్ గమనించారు. తన దగ్గరకు వచ్చింది ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా వారు ఫలానా అని ఎప్పుడూ చెప్పలేదు.

"ధోనీ మాదిరిగానే తల్లిదండ్రులు కూడా నిరాడంబరంగా ఉంటారు. ఎలాంటి ఆడంబరం లేకుండా సాధారణ రోగిలా వచ్చిన ధోనీని చూసి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. తనకు సెలబ్రిటీ అనే గర్వం లేదు. అయితే ఇప్పుడు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ధోని వస్తాడనే వార్త సంచలనం అయ్యింది. అతని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

ఆగస్టు 2020లో, ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుండి అతను IPLలో చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రమే నాయకత్వం వహిస్తున్నాడు.

Tags

Next Story