Mithali Raj: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్ బై..

Mithali Raj: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్ బై..
Mithali Raj: 'ఈరోజు నేను అన్ని ఇంట్నేషనల్ క్రికెట్ ఫార్మ్స్ నుండి రిటైర్ అవుతున్నాను'.

Mithali Raj: అన్ని స్పోర్ట్స్‌కంటే క్రికెట్‌కు ఉండే పాపులారిటీనే వేరే లెవెల్. కానీ క్రికెట్‌లో మెన్ టీమ్‌కు వచ్చిన ఆదరణ ఉమెన్ టీమ్‌కు రాలేదు. అయినా ఇప్పటికీ కొందరు మహిళా క్రికెటర్లు.. క్రికెట్‌నే తమ ప్రొఫెషన్‌గా ఎంచుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు మిథాలీ రాజ్. ఉన్నట్టుండి అన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మ్స్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించి మిథాలీ రాజ్ అందరికీ పెద్ద షాకే ఇచ్చింది.

'బ్లూ కలర్ వేసుకొని మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి చిన్నప్పటి నుండి నేను చేసిన ప్రయాణం ఎంతో ప్రత్యేకం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. ప్రతీ ఒక్క సందర్భం నాకు ఓ కొత్త విషయాన్ని నేర్పించింది. గత 23 ఏళ్లు నా జీవితంలో మరిచిపోలేనివి. కానీ అన్ని ప్రయాణాలలాగానే ఇది కూడా ఓ ముగింపుకు రావాలి. ఈరోజు నేను అన్ని ఇంట్నేషనల్ క్రికెట్ ఫార్మ్స్ నుండి రిటైర్ అవుతున్నాను'. అంటూ మిథాలీ రాజ్ ట్వీట్ చేశారు.


Tags

Next Story