Mithali Raj: 'అలా జరిగితే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తా'.. మిథాలీ ప్రకటన
Mithali Raj: ఉమెన్ క్రికెట్ టీమ్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లిన స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్. ఉమెన్ ఇండియన్ టీమ్ కెప్టెన్‌గా తను టీమ్‌ను ఎన్నో విజయాలకు ముందుండి నడిపించడం మాత్రమే కాదు.. ఒక ప్లేయర్‌గా కూడా తన పేరు మీద ఎన్నో రికార్డులను నిలబెట్టుకుంది. అందుకే తను రిటైర్మెంట్ ప్రకటించగానే ఎంతోమంది అభిమానులు నిరాశపడ్డారు. కానీ తను రిటైర్మెంట్ నుండి వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా తెలిపింది.
ఇప్పటివరకు కేవలం మెన్ టీమ్ వరకే ఐపీఎల్ పరిమితమయ్యింది. అయితే ఉమెన్ టీమ్‌కు కూడా ఐపీఎల్ ఫార్మాట్‌ను ప్రారంభించాలని బీసీసీఐ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. అయితే ఇప్పటికే అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ.. ఐపీఎల్ మొదలయితే మాత్రం మళ్లీ గ్రౌండ్‌లోకి దిగే అవకాశం ఉందని పరోక్షంగా తెలిపింది.
ఇటీవల ఓ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మిథాలీ రాజ్.. ఐపీఎల్‌లో ఆడాలని తనకు ఉందని మనసులోని మాటను బయటపెట్టింది. మరి రిటైర్మెంట్ సంగతేంటి అని అడగగా.. ఐపీఎల్ కోసం రీ ఎంట్రీ ఆప్షన్ ఎప్పుడూ ఓపెన్‌గా పెట్టుకుంటానని తెలిపింది. రిటైర్మెంట్ నుండి వెనక్కి రావడానికి సిద్ధమంది. దీంతో మిథాలీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వచ్చే ఏడాది ఉమెన్ ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Mithali Raj said, "It would be lovely to be part of the women's IPL. I'm open to coming out of retirement." (To ICC).
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com