Mohammad Azharuddin: 'వారిద్దరికీ ఈగో'.. మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్..

Mohammad Azharuddin: ప్రస్తుతం టీమిండియా మధ్య ఉన్న మనస్పర్థల వల్ల సౌతాఫ్రికా టెస్ట్ ఎలా జరుగుతుందో అన్న భయం చాలామంది క్రికెట్ లవర్స్‌లో మొదలయ్యింది. రోహిత్ శర్మ కెప్టెన్ అని ప్రకటన వచ్చినప్పటి నుండి టీమిండియా ప్లేయర్స్ మధ్య పూర్తిగా సైలెన్స్ ఏర్పడింది. ఎవరూ దీని గురించి స్పందించట్లేదు. కానీ ఇటీవల మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈ విషయంపై ఘాటు వ్యాఖ్యలే చేశారు.
క్రికెట్ నుండి ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్రేక్ తీసుకున్నారు. అయితే వీరు బ్రేక్ తీసుకోవడం తప్పు కాదని, కాకపోతే బ్రేక్ తీసుకున్న సందర్భం గురించే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో ఇంత గందరగోళం జరుగుతున్న సమయంలో విరాట్, రోహిత్ బ్రేక్ నిజంగానే పలు అనుమానాలకు దారితీస్తోంది.
అంతే కాకుండా ఈగోలకు పోయి.. ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడడానికి సిద్ధంగా లేరని తెలుస్తోందని అజార్ అన్నారు. సౌతాఫ్రికా టెస్ట్ దగ్గర పడుతున్న సమయంలో ఇలా చేయడం సరికాదని ఆయన తెలిపారు. మరి టీమిండియాలో నెలకొన్న ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో, మళ్లీ తమ ఫేవరెట్ ప్లేయర్స్‌ను ఎప్పుడు కలిసి చూస్తామో అని విరాట్, కోహ్లీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com