Mohammed Siraj: మొదట ఏసీ లేని కారు.. ఆ తర్వాత ఏకంగా మెర్సిడెస్ బెంజ్..
Mohammed Siraj: క్రికెటర్స్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే సులువైన మార్గం ఐపీఎల్. అంతే కాదు ఈ ఐపీఎల్.. ఆటగాళ్లను ఇండియన్ టీమ్‌లో ఆడేంత రేంజ్‌కు కూడా తీసుకెళ్తాయి. ఒకప్పుడు క్రికెట్ లవర్స్‌కు ఎంటర్‌టైన్మెంట్‌గా మాత్రమే ఉండే ఐపీఎల్.. మెల్లగా క్రేజ్ పెరగడంతో ఓ బిజినెస్‌లాగా మారిపోయింది. ఆ ఐపీఎల్ ఆక్షన్ గురించి తన అనుభవాలను అందరితో పంచుకున్నాడు మహ్మద్ సిరాజ్.
ఐపీఎల్ ఆక్షన్ అనేది ఆటగాళ్లకి చాలా కీలకం. ఇండియన్ టీమ్ క్రికెట్ సెలక్టర్స్ దృష్టిలో పడడానికి ఐపీఎల్ చాలా కీలకం. కానీ ఒక్కసారి ఐపీఎల్‌లో ఫేమ్ వచ్చిన తర్వాత అవకాశం ఆటగాడిని వెతుక్కుంటూ వస్తుంది. మహ్మద్ సిరాజ్ విషయంలో కూడా అదే జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు సిరాజ్.
ముందుగా తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన సిరాజ్‌ను.. 2017లో ఆర్‌సీబీ సొంతం చేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ నుండి ఆర్‌సీబీకి రావడానికి ఆక్షన్‌లో సిరాజ్‌కు రూ. 2.7 కోట్లు దక్కాయి. అయితే ఐపీఎల్‌లో తనకు మొదటిసారి వచ్చిన డబ్బుతో సిరాజ్ ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్న విషయాన్ని బయటపెట్టాడు.
మొదటిసారి వచ్చిన డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొన్న సిరాజ్.. అందులో ఏసీ కూడా లేదన్నాడు. ఆ తర్వాత ఏడాది ఏకంగా మెర్సిడెస్ బెంజ్‌నే కొనుగోలు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ నుండి ఆర్‌సీబీకి వచ్చిన తర్వాత గత అయిదేళ్ల నుండి సిరాజ్ ఇంకా అదే టీమ్‌లో కొనసాగుతున్నాడు. 2022 ఐపీఎల్ కోసం కూడా రూ.7 కోట్లతో సిరాజ్‌ను రిటైన్ చేసుకుంది ఆర్‌సీబీ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com