MS Dhoni: రిటైర్మెంట్‌పై ధోనీ క్లారిటీ.. వచ్చే ఐపీఎల్‌లో..
MS Dhoni: క్రికెటర్ల రిటైర్మెంట్ వార్త తమ ఫ్యాన్స్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. తమ ఫేవరెట్ ప్లేయర్స్ కోసమే క్రికెట్ చూసేవారు కూడా ఉంటారు. అయితే తన ఆటతో ఎంతోమంది అభిమానలను సంపాదించుకున్న క్రికెటర్స్‌లో ఎమ్ ఎస్ ధోనీ కూడా ఒకడు. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. ఐపీఎల్ 2023లో ధోనీ ఉండడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.. దీనిపై ధోనీ స్వయంగా స్పందించాడు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. అందుకు ముఖ్య కారణం ధోనీనే అంటుంటారు ఫ్యాన్స్. ఐపీఎల్ అనేది మొదలయినప్పటి నుండి ధోనీ.. సీఎస్‌కే టీమ్ తరపునే ఆడుతూ ఉన్నాడు. ఆ టీమ్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు ధోనీ. అయితే అనూహ్యంగా ఐపీఎల్ 2022లో చెన్నై టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఇదే సమయంలో తన రిటైర్మెంట్ గురించి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ధోనీ.
ఐపీఎల్ 2023లో కూడా తాను ఎల్లో జెర్సీలో కనిపించనున్నట్టు స్పష్టం చేశాడు ఎమ్ ఎస్ ధోనీ. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడకుండా.. అభిమానులకి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్లిపోతే అది అన్యాయమే అవుతుందని తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే వచ్చే ఏడాది ప్రతీ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగితే.. అందరు ఫ్యాన్స్‌కు థాంక్యూ చెప్పే అవకాశం తనకు దక్కుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com