MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2022లో..

MS Dhoni (tv5news.in)

MS Dhoni (tv5news.in)

MS Dhoni: ఎమ్ ఎస్ ధోనీ.. ప్రతీ క్రికెట్ లవర్‌కు ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్.

MS Dhoni: ఎమ్ ఎస్ ధోనీ.. ప్రతీ క్రికెట్ లవర్‌కు ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. మిస్టర్ కూల్ కెప్టెన్, మహి.. ఇవి తన ఫ్యాన్స్ తనను ముద్దుగా పిలుచుకునే పేర్లు. అలాంటి ధోనీ ఒక్కసారిగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. వరల్డ్ క్రికెట్ నుండి తాను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించేశాడు. అది ప్రతీ ధోనీ ఫ్యాన్‌కు ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. కానీ అదే ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్‌ను వినిపించాడు కెప్టెన్ కూల్.

ఈ సంవత్సరం ఎన్నో అడ్డంకుల మధ్య ఐపీఎల్ మ్యాచ్ పూర్తయ్యింది. అసలు పూర్తవుతుందా లేదా అన్న మ్యాచ్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయగలిగింది ఐపీఎల్ యాజమాన్యం. ఐపీఎల్ 2021 విజేతలుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచారు. ఇన్ని రోజుల తర్వాత సీఎస్‌కే టీమ్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సెలబ్రేషన్‌లో కొన్ని గుడ్ న్యూస్‌లను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు ధోనీ.

ఇంటర్నేషన్ క్రికెట్ నుండి ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో.. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని తన అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇదే విషయాన్ని ధోనీని అడగగా ఇది ఇంకా నవంబరే కదా ఐపీఎల్ 2022కి ఇంకా చాలా టైమ్ ఉందని అన్నాడు. అంతే కాకుండా తన తరువాతి క్రికెట్ కెరీర్ గురించి కూడా ప్రస్తావించాడు.

'నేను నా క్రికెట్ కెరీర్‌ను ఎప్పుడూ ప్లాన్ చేసుకున్నాను. నా చివరి ఓడీఐ ఆటను రాంచీలో ఆడాను. నా చివరి టీ20 చెన్నైలో జరగాలని ఆశిస్తున్నాను. అది వచ్చే సంవత్సరమా. ఐదు సంవత్సరాల తర్వాతా.. అని నాకు కూడా తెలీదు' అన్నాడు. ఎప్పుడైతే ఏంటి ఐపీఎల్‌, టీ20లో తాను ఖచ్చితంగా ఆడతానని భరోసా ఇచ్చాడని ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Tags

Next Story