MS Dhoni : ధోని అరుదైన రికార్డు.. కోహ్లీ తర్వాత..!

MS Dhoni :  ధోని అరుదైన రికార్డు.. కోహ్లీ తర్వాత..!
MS Dhoni : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు..

MS Dhoni : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఎంఎస్ ధోని నిలిచాడు.

ఒకే జట్టు తరుపున అత్యధిక మ్యాచ్ లు (200) లు ఆడిన రెండో ప్లేయర్ గా ధోని ఈ ఘనత సాధించాడు. అతడికంటే ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ (218) ఉన్నాడు. ఇక మొత్తం ఐపీఎల్ లో ధోనికి ఇది 230వ మ్యాచ్ కావడం విశేషం.

2016, 2017లలో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌ తరుపున 30 మ్యాచ్‌లు ఆడాడు ధోని. ఇక ధోని తర్వాత చెన్నై తరఫున ఆడిన సురేశ్ రైనా 176 మ్యాచ్‌ల్లో ఆడగా, కొద్ది రోజుల క్రితం కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 142 మ్యాచ్‌లు ఆడాడు.

Tags

Next Story