Dhoni : రైతుగా మారిన భారత మాజీ క్రికెటర్ MS ధోనీ

MS Dhoni : భారత మాజీ క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోనీ రైతుగా మారాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత రాంచీకి సమీపంలో ఉన్న.. చంబో ప్రాంతంలో 43 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకున్న ధోనీ.. అక్కడ వివిధ రకాల కూరగాయలు, పండ్లును పండిస్తున్నాడు.
ఇజా ఫామ్ పేరిట దీనిని నడుపుతున్నాడు. ఇక తాజాగా హోలీ సందర్భంగా మూడు రోజుల పాటు.. తన ఫామ్‌హౌజ్‌ను ఓపెన్ చేస్తునట్లు ప్రకటించాడు ధోనీ. సెంబోలో ఉన్న తన పంట పొలాలను ఎవరైనా విజిట్ చేయవచ్చని తెలిపాడు. ఇక ధోనీ ఫామ్‌హౌజ్‌లో పండిస్తున్న కూరగాయలు, స్ట్రాబెర్రీలను బయట అమ్ముతున్నారు.
ధోనీ తోటల్లో స్ట్రాబెర్రీ, పొప్పడి, జామికాయ, ఖర్బూజా, బఠానీ, కాప్సికమ్ పండిస్తున్నారు. ఇక చేపలు, గోధుమలను కూడా పెద్ద ఎత్తున పండిస్తున్నారు. వీటితో పాటు పౌల్ట్రీ, డైరీలు కూడా ఇందులో ఉన్నాయి. తరుచూ ధోనీ తన ఫామ్‌హౌజ్‌ను విజిట్ చేస్తుంటాడని స్థానికులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com