WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు స‌ర్వం సిద్ధం..

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు స‌ర్వం సిద్ధం..
సందడి చేయనున్న బాలీవుడ్ బాద్‌షా!

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ నేటినుంచి మొదలు కానుంది.మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. మొత్తం ఐదు జట్లు (ఢిల్లీ, గుజరాత్‌, ముంబై, బెంగళూరు, యూపీ) పాల్గొంటున్న ఈ లీగ్‌.. గ్రూప్‌ దశలో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. నిరుడు జరిగిన డబ్ల్యూపీఎల్‌ మంచి ప్రజాదరణ దక్కించుకోగా.. ఈ సారి బెంగళూరు, ఢిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ గత ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోగా.. ముంబై బౌలర్‌ హేలీ మాథ్యూస్‌ 16 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకుంది. వీరిద్దరి మధ్య పోరు మరోసారి అభిమానులకు మజాను పంచనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన భారత క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన టిటాస్ సాధుపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మిన్ను మణి కూడా WPLలో తన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉంది. ముంబై ఇండియన్స్‌కు తొలి టైటిల్‌ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మలపై కూడా విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది

ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ఓపెనింగ్ కార్యక్రమాన్నిఅద్భుతంగా నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఈ ఈవెంట్‍లో కొందరు బాలీవుడ్ సినీ స్లార్ల పర్ఫార్మెన్సులుగా కూడా ఉండనున్నాయి. తొలిరోజు జరిగే ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్‌ నటులు షారూఖ్ ఖాన్, టైగర్‌ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, కార్తీక్‌ ఆర్యన్‌ చిందేయనుండగా ప్రముఖ సింగర్లు తమ పాటలతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈ కార్యక్రమం తరువాత డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ రాత్రి 7:30కు జరగనుంది.

ముంబై ఇండియన్స్:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హేలీ మాథ్యూస్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింటిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, సైకా ఇషాక్, యాస్తిక భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, ఫాతిమా జాఫర్, కీర్తన బాలకృష్ణన్.

ఢిల్లీ క్యాపిటల్స్:

మెగ్ లానింగ్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, లారా హారిస్, షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, అన్నాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, అశ్వనీ కుమారి, జెస్ జొనాస్సెన్, మారిజానే కాప్, స్నేహ దీప్తి, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, శిఖా పాండే , తానియా భాటియా, పూనమ్ యాదవ్, టిటాస్ సాధు.


Tags

Read MoreRead Less
Next Story