మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ముంబయి

మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ముంబయి
ముంబయి మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో..

ముంబయి మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ , శ్రేయస్ అయ్యర్ రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. డికాక్‌ , సూర్యకుమార్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ విజయంతో ముంబయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. రోహిత్‌ సేనకు వరుసగా ఇది నాలుగో విజయం.

లక్ష్యఛేదనలో ముంబయికి గొప్ప ఆరంభమేమి దక్కలేదు. నిదానంగా ఆడిన రోహిత్ శర్మ అయిదో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి బౌండరీల మోత మోగించారు. కానీ ఢిల్లీ బౌలర్లు గొప్పగా పుంజుకుని మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌ వరకు తీసుకువచ్చారు. చివరి ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా కృనాల్ పాండ్య రెండు బౌండరీలు సాధించి ముంబయికి విజయాన్ని అందించాడు.

Tags

Read MoreRead Less
Next Story