Vivo IPL 2021: ఓడిపోయిన మ్యాచ్‌లో ఆరు రికార్డులు..

Vivo IPL 2021: ఓడిపోయిన మ్యాచ్‌లో ఆరు రికార్డులు..
Vivo IPL 2021: ఏ ఆట అయినా ముగిసే వరకు ఎవరు గెలుస్తారు అనేది అస్సలు ఊహించలేం.

Vivo IPL 2021: ఏ ఆట అయినా ముగిసే వరకు ఎవరు గెలుస్తారు అనేది అస్సలు ఊహించలేం. క్రికెట్‌లో అయితే అది మరింత కష్టం. చివరి బాల్ వరకు ఏమైనా జరగొచ్చు. ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న టీమ్ చివరిలో ఓడిపోవచ్చు. అస్సలు ఆడదు అనుకున్న టీమ్ ఉన్నట్టుండి పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లోకి వెళ్లొచ్చు. నిన్నటి ముంబై ఇండియన్స్ వెర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది.

ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీమ్‌గా నిలిచింది. కానీ ఈసారి మాత్రం ముంబైకు ప్లే ఆఫ్స్‌లో కూడా చోటు దక్కలేదు. నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో హోరాహోరీగా తలబడిన ముంబాయ్ సరిపడా రన్ రేట్‌ను సాధించలేక వెనుదిరిగింది. సన్‌రైజర్స్ ఎలాగో పాయింట్స్ టేబుల్‌లో చివరిలో ఉంది కాబట్టి వారు కూడా ఇంటి బాట పట్టాల్సిందే. నిన్నటి మ్యాచ్ వల్ల ఇరు టీమ్‌లకు ఏ మంచి జరగకపోయినా ఐపీఎల్ 2021లో మాత్రం కొన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయి.

ఐపీఎల్ 2021లో 16 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీను సాధించాడు ఇషాన్ కిషన్.

ఒకే మ్యాచ్‌లో అయిదు క్యాచ్‌లు పట్టి రికార్డు క్రియేట్ చేసాడు సన్‌రైజర్స్ ప్లేయర్ నబీ

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో నిన్నటిదే అత్యధిక స్కోర్ (235-9)



ఇక పవర్ ప్లేలో 83-1 పరుగులు చేసింది ముంబై. ఇప్పటివరకు చేసిన వాటిలో ఇది సెకండ్ హైయెస్ట్

10 ఓవర్లలో 131-3 పరుగులు చేసి రికార్డ్ సృష్టించింది ముంబై

ఫోర్ల విషయంలో ఒకే మ్యాచ్‌లో 30 ఫోర్లు కొట్టి రెండో స్థానంలో నిలిచింది ముంబై

Tags

Next Story