ఇది మాకు గుణపాఠం.. టీంఇండియాను తక్కువ అంచనా వేయం: ఆసీస్ కోచ్

ఇది మాకు గుణపాఠం.. టీంఇండియాను తక్కువ అంచనా వేయం: ఆసీస్ కోచ్
భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు 2-1 తో గెలుచుకుంది. చివరి టెస్ట్ డ్రా అవుతుంది కావచ్చు అనుకున్న అభిమానులను సప్రైజ్ చేస్తూ విక్టరీ కొట్టింది భారత్.

భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు 2-1 తో గెలుచుకుంది. చివరి టెస్ట్ డ్రా అవుతుంది కావచ్చు అనుకున్న అభిమానులను సప్రైజ్ చేస్తూ విక్టరీ కొట్టింది భారత్... అయితే టీంఇండియాను తక్కువ అంచనా వేయొద్దని ఈ సిరీస్ ద్వారా తెలిసొచ్చిందని ఆసీస్ ప్రధాన కోచ్ లాంగర్ అన్నాడు. 150 కోట్ల మంది భారతీయుల తరపున 11 మంది ప్లేయర్లు వచ్చారంటే వాళ్లెంత ప్రతిభావంతులో తెలిసిందన్నాడు.

మొదటి టెస్టులో 36 పరుగులకే ఆలౌటైనా అద్భుతంగా పుంజుకున్నారని, యంగ్ బౌలర్లు తమ బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని చెప్పాడు. ఇది తమకు గుణపాఠం లాంటిదని, ప్రస్తుతం ప్రపంచంలో టీం ఇండియానే బలమైన జట్టు అని అన్నాడు. గబ్బా టెస్ట్ లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రిషబ్ పంత్ ను లాంగర్ ప్రశంసించాడు.

Tags

Read MoreRead Less
Next Story