ODI World Cup: ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్లు ఇవే
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో పరుగల వరద పారుతోంది. శనివారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ వేదికగా జరిగిన శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన పోరులో పలు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా శ్రీలంక-కివీస్ మ్యాచ్ కొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా అయిదు వికెట్ల నష్టానికి 428 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో లంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ఇలా దక్షిణాఫ్రికా 428, లంక 236 పరుగులతో ఈ మ్యాచ్‌లో 754 పరుగులు నమోదయ్యాయి. 2019లో నాటింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైన 754 పరుగుల రికార్డును ఈ మ్యాచ్ బద్దలు కొట్టింది. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా 754 పరుగులతో దక్షిణాఫ్రికా- శ్రీలంక మ్యాచ్ తొలి స్థానంలో నిలిచింది.
మిగిలిన నాలుగు మ్యాచ్‌లు ఇవే
2019 ప్రపంచకప్‌లో నాటింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్.... ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్‌గా నిలిచింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అయిదు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేయగా... ధీటుగా స్పందించిన బంగ్లాదేశ్ కూడా 331 పరుగులు చేసింది. ఈ రెండు జట్లు కలిపి 2019 ప్రపంచకప్‌లో 714 పరుగులు నమోదు చేశాయి.
ఆస్ట్రేలియా vs శ్రీలంక
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ రెండు జట్లు కలిపి 688 పరుగులు సాధించాయి. ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ సెంచరీతో ఆస్ట్రేలియా 376 పరుగులు చేసింది. బరిలోకి దిగినశ్రీలంక కుమార సంగక్కర సెంచరీతో 312 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 688 పరుగులు నమోదయ్యాయి. ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్లు నమోదైన మ్యాచ్‌ల స్థానంలో ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది.
ఇంగ్లాండ్ vs పాకిస్తాన్
2019 ప్రపంచకప్‌లో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 348 పరుగులు చేసింది. దీనికి ధీటుగా స్పందించిన బ్రిటీష్ జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. జో రూట్ అద్భుత శతకం చేయడంతో ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 334 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 682 పరుగులు నమోదయ్యాయి.
భారత్ vs ఇంగ్లాండ్
2011 ప్రపంచకప్‌లో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సచిన్ సెంచరీతో 338 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ కూడా అండ్రూ స్ట్రాస్ సెంచరీతో సరిగ్గా 338 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 676 పరుగులు నమోదయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com