IND vs Pak - Ramiz Raja : పాక్ క్రికెటర్లకి బంపర్ ఆఫర్.. ఇండియా పై గెలిస్తే..!

IND vs Pak - Ramiz Raja : ఇండియా, పాకిస్తాన్. మ్యాచ్ అంటే ఈ రెండు దేశాలకి మాత్రమే కాదు యావత్ ప్రపంచ దేశాలకి మంచి కిక్కిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆటోమాటిక్‌గా వైబ్స్ పెరిగిపోతాయి.. ఇక బెట్టింగ్ రాయుళ్ళకి అయితే పండగే.. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. త్వరలో దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమ్ సభ్యులకు బ్లాంక్ చెక్ ఇస్తానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును బలోపేతం చేసేందుకు ఓ బడా పారిశ్రామికవేత్త సూచన మేరకు ఈ ప్రకటన చేసినట్లుగా ఆయన వెల్లడించారు. తాజాగా జరిగిన పీసీబీ భేటిలో రమీజ్ రాజా మాట్లాడుతూ.. ఐసీసీ ఇచ్చిన 50 శాతం నిధులతోనే పీసీబీ నడుస్తోంది. ఐసీసీకి 90 శాతం నిధులు బీసీసీఐ నుండి వస్తాయి. ఒకవేళ బీసీసీఐ .. ఐసిసికి నిధులను ఇవ్వడం నిలిపివేస్తే, పీసీబీ కుప్పకూలిపోతుంది.
పాకిస్తాన్ క్రికెట్‌ను పటిష్టంగా తీర్చిదిద్దడానికి నేను నిశ్చయించుకున్నాను, అయితే ఓ పెద్ద ఇన్వెస్టర్ ఒకవేళ ఇండియాను వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓడిస్తే, పాక్ జట్టుకు బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా వెల్లడించాడు. దాని మీద ఎంత మొత్తమైనా రాసుకోవచ్చని అతను తనకు ఆఫర్ ఇచ్చినట్లు రమీజ్ రాజా తెలిపారు.
అయితే ఆ పెట్టబడిదారుడి పేరును వెల్లడించడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. ఉత్తమమైన క్రికెట్ జట్టు నిలబడాలంటే ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమేనని అన్నారు. అటు ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా భారత్‌ను ఓడించలేదు పాకిస్తాన్. మరి చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com