Deepak Chahar Girlfriend: దీపక్ చాహర్ గర్ల్‌ఫ్రెండ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

Deepak Chahar Girlfriend: ఈరోజుల్లో ప్రపోజల్స్ కూడా చాలా వెరైటీగా జరుగుతున్నాయి. అస్సలు ఊహించని సందర్భంలో, ఊహించని ప్లేస్‌లో ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఒప్పుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు అబ్బాయిలు. దానికి ఎక్కువమంది ఎంచుకుంటున్న చోటు క్రికెట్ స్టేడియం. చాలామంది కపుల్స్ ఇలా ప్రపోజ్ చేసుకొనే సంతోషంగా ఉంటున్నారు. అందుకే ఒక క్రికెటర్ కూడా వారి బాటనేపట్టాడు.
చెన్నై, పంజబ్‌కు జరిగిన మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. మ్యాచ్ అయిపోగానే చెన్నై బౌలర్ దీపక్ చాహర్ స్టేడియంలో కూర్చొని ఆట చూస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాడు. అనూహ్యంగా అక్కడే తన మోకాళ్లపై కూర్చొని రింగ్ తీసుకొని తనకు ప్రపోజ్ చేసాడు. ఆ అమ్మాయి క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసి దీపక్ లవ్‌ను యాక్సెప్ట్ చేసింది. ఇంతకీ దీపక్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరా అని గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తు్న్నారు నెటిజన్లు.
దీపక్ చాహర్ గర్ల్‌ఫ్రెండ్ పేరు జయా భరద్వాజ్. తను సిద్ధార్థ్ భరద్వాజ్ అనే యాక్టర్, మోడల్ సోదరి. బిగ్ బాస్ హిందీ సీజన్ 5 ద్వారా సిద్ధార్థ్‌కు మంచి గుర్తింపు లభించింది. తన చెల్లెలు జయా గురించి ఇప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా ప్రస్తుతం దీపక్ చాహర్ గర్ల్‌ఫ్రెండ్‌గా తన పేరు వైరల్ అయ్యింది. తను ఢిల్లీలోని ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com