20 Feb 2023 11:46 AM GMT

Home
 / 
క్రీడలు / క్రికెట్ / Prithvi Shaw Attack:...

Prithvi Shaw Attack: కస్టడీలో మరో ముగ్గురు

క్రికెటర్ పృద్ధ్వీ షాపై దాడి కేసులో మరో ముగ్గురు అమ్మాయిల అరెస్ట్

Prithvi Shaw Attack: కస్టడీలో మరో ముగ్గురు
X

క్రికెటర్ పృధ్వీ షాపై దాడి కేసులో సోషల్ మీడియా సెలబ్రిటీ స్వప్నా గిల్ తో పాటూ మరో ముగ్గురిని పోలీసులు కస్డడీకి తరలించారు. సోమవారంతో పోలీసుల కస్టడీ ముగియడంతో వారిని 14రోజుల జుడీషియల్ కస్టడీకి తరలించారు. భారత చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం స్వప్నను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పృధ్వీ స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ పృధ్విపై 8 మంది అమ్మాయిలు హాకీ బ్యాట్ తో దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్రికెటర్ కారును వెంబడించి, అతడి నుంచి రూ.50వేల కూడా డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు స్వప్న మాత్రం తాను ఎవరిపైనా దాడి చేయలేదని, పృధ్వినే తనపైనా, తన స్నేహితురాళ్ల పైనా దాడి చేశాడని, అందుకే క్రర పట్టుకుని తిరగాల్సి వచ్చిందని వెల్లడించింది. ఏమైనా రోజుకో మలుపు తిరుగుతున్న పృధ్వీ షా దాడి కేసు ఏ కంచికి చేరుతుందో చూడాలి.



Next Story