ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్‌

ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్‌
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్‌ అయ్యారు..

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)- ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య తొలి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రారంభానికంటే ముందే సీఎస్‌కే కు ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రకటించింది. దీంతో సురేశ్‌ రైనా దుబాయి నుంచి వెనక్కి వచ్చారు. మరోవైపు సురేశ్‌ రైనాకు పూర్తి మద్ధతు ఇస్తామని సీఎస్‌కే ప్రకటించింది. కాగా, ఇటీవలే సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story