Rajat Patidar: 60 ఏళ్ల క్రికెట్ ఫ్యాన్‌ను గాయపరిచిన ఆటగాడు..

Rajat Patidar: క్రికెట్‌లో ఆటగాళ్లు సిక్సర్స్ కొడుతుంటే ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మిగతా క్రికెట్ ఫార్మ్స్‌లో కంటే ఐపీఎల్‌లో క్రికెటర్లు ఎక్కువగా సిక్సర్స్ కొట్టడానికి ఛాన్స్ తీసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఆ సిక్సర్ స్టేడియంలో కూర్చునే వారికి ప్రమాదకరం అవుతుంటాయి. తాజాగా ఓ యంగ్ క్రికెటర్ కొట్టిన సిక్సర్‌కు 60 ఏళ్ల క్రికెట్ ఫ్యాన్ గాయపడ్డాడు.
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌పై ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నా కూడా బెంగుళూరు మరోసారి వారిని నిరాశపరిచింది. కానీ పలువురు ఆటగాళ్లు మాత్రం టీమ్ తరపున మంచి ఆటనే కనబరిచారు. అందులో రాజత్ పటీదార్ ఒకరు.
మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన రజత్.. తను అడుగుపెట్టిన ఫస్ట్ ఓవర్‌లోనే సిక్సర్‌ను బాదాడు. అయితే ఈ బంతి ఓ 60 ఏళ్ల క్రికెట్ ఫ్యాన్ తలకు తగిలింది. కానీ నేరుగా వెళ్లి తాకకపోవడం వల్ల గాయం అంత పెద్దగా అవ్వలేదు. కానీ ఈ విషయాన్ని ఆటగాళ్లు గమనించలేదు. చివరగా ఆర్‌సీబీ.. పంజాబ్ చేతిలో ఓటమి పాలయ్యింది. దీంతో బెంగుళూరు టీమ్ ఫ్యాన్స్‌కు ఐపీఎల్ 2022పై ఆశలు పూర్తిగా పోయాయనే చెప్పాలి.
— Addicric (@addicric) May 13, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com