Ravindra Jadeja: జడేజా కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్..

Ravindra Jadeja: ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్‌లో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఐపీఎల్ మొదలయినప్పటి నుండి కొత్తగా ఏర్పడిన టీమ్స్ సత్తా చాటుతుంటే.. పాత టీమ్స్ మాత్రం చతికిలబడ్డట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఖాతాలో ఒక్క విన్ కూడా లేదు. దీంతో కొత్తగా కెప్టెన్ అయిన రవీంద్ర జడేజాపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రవిశాస్త్రి కూడా జడేజా కెప్టెన్సీ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
సీఎస్‌కే టీమ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. దానికి ముఖ్య కారణం ధోనీ. ధోనీ ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్‌కు ఇష్టపడే అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ అనేది ప్రారంభయినప్పటి నుండి ధోనీ సీఎస్‌కే టీమ్ కోసమే ఆడుతున్నాడు. ఈ టీమ్‌కు ఇప్పటివరకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా.. చివరికి ఐపీఎల్ ట్రాఫీని అందుకోవడంలో మాత్రం చాలాసార్లు విజయం సాధించింది. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ధోనీ ముందుండి నడిపించినంత కాలం సీఎస్‌కే ఆట అందరినీ ఆకట్టుకుంది. కానీ ఐపీఎల్ 2022 ప్రారంభమయ్యే కొన్నిరోజుల ముందే ధోనీ తన కెప్టెన్సీని జడేజా చేతిలో పెట్టాడు. దీంతో జడేజాకు ఒత్తిడి ఎక్కువయిపోయింది. ఐపీఎల్ ప్రారంభమయినప్పటి నుండి సీఎస్‌కే ఆట ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దీనిపై స్పందించారు.
ఈ ఏడాది కూడా జడేజా కెప్టెన్‌లాగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాల్సింది అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు రవిశాస్త్రి. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ)కు కెప్టెన్ అయిన డుప్లెసిస్‌ను రిటైన్ చేసుకుని సీఎస్‌కేకు కెప్టెన్ చేయాల్సింది అన్నారు. డూప్లెసిస్‌ను చెన్నై వదులుకొని ఉండాల్సింది కాదు అన్నారు రవిశాస్త్రి. అంతే కాకుండా డూప్లెసిస్ ఆటను ప్రశంసించారు కూడా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com