ASHWIN RECORDS: ఇక అశ్విన్ ముందు కుంబ్లే ఒక్కడే

తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్సమెన్లకు చుక్కలు చూపించే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Spinner Ravichandran Ashwin) మరో అరుదైన ఘనతను సాధించాడు. ఎన్నో మరపురాని విజయాలను కట్టబెట్టిన ఈ స్పిన్ మాంత్రికుడు భారత్ తరపును అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్(second-highest wicket-taker )గా రికార్డు సృష్టించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సత్తా కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందిన అశ్విన్... వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు నేలకూల్చి కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్స్ తీసిన రెండో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఈ క్రమంలో హర్భజన్ సింగ్‌ను (707)ను యాష్ అధిగమించాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 709 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో 486 వికెట్లు, వన్డేల్లో 151, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. ఇక అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ముందున్నాడు. జంబో 953 వికెట్స్ తీశాడు. ఇక యాష్ కుంబ్లేను టార్గెట్ చేశాడు. అయితే అది సులువు మాత్రం కాదు.
365 అంతర్జాతీయ మ్యాచ్‌లలో హర్భజన్ సింగ్ 707 వికెట్లు పడగొట్టడు. 43 ఏళ్ల హర్భజన్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 417, వన్డేల్లో 269 మరియు టీ2ల్లో 25 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో హర్భజన్ మొత్తం వికెట్ల సంఖ్య 711. దీనిని అశ్విన్ అధిగమించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత అత్యుత్తమ బౌలర్ అనిల్ కుంబ్లే(India's best bowler in international cricket) 401 మ్యాచ్‌ల్లో 30.06 సగటుతో 10/74 బెస్ట్‌తో 953 పరుగులు చేశాడు. టెస్టుల్లో అశ్విన్ మొత్తం 8 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. అనిల్ కుంబ్లే( Anil Kumble) కూడా 8 సార్లు టెస్టుల్లో పదేసి వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ టెస్టుల్లో 34 సార్లు అయిదేసి వికెట్లు తీసుకున్నాడు. కుంబ్లే 35 సార్లు ఆ ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో అయిదేసి వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ ఇప్పుడు అయిదో స్థానంలో నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో అయిదు లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు అశ్విన్ ఆరు సార్లు తీసుకున్నాడు.
లంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 11 సార్లు, హీరత్ 8 సార్లు ఆ ఘనతను సాధించారు. కరీబియన్ పిచ్‌లపై ఉత్తమ బౌలింగ్ ప్రదర్శించిన రెండో స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు. 1973లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో టోనీ గ్రేగ్ 156 రన్స్ ఇచ్చి 13 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ తొలి టెస్ట్‌లో 12/113తో కెరీర్ బెస్ట్ నమోదు చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com