Ravindra Jadeja: 'అప్పుడు నేను చనిపోయానని ప్రచారం చేశారు' జడేజా

Ravindra Jadeja: అప్పుడు నేను చనిపోయానని ప్రచారం చేశారు జడేజా
X
Ravindra Jadeja: ఇప్పుడు క్రికెటర్స్ కూడా సోషల్ మీడియా కంటెంట్‌లో భాగమయిపోయారు.

Ravindra Jadeja: టీమిండియా ప్రస్తుతం ఆసియా కప్ 2022 ప్రాక్టీస్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల పాకిస్థాన్‌పై ఇండియా గెలిచిన మ్యాచ్.. క్రికెట్ లవర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఆటలో ప్రతీ ఇండియన్ క్రికెటర్ టీమ్‌ను గెలిపించాలని ప్రయత్నించి సాధించారు. అయితే మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఒకప్పుడు సినీ సెలబ్రిటీపై మాత్రమే రూమర్స్ అనేవి వచ్చేవి. కానీ ఇప్పుడు క్రికెటర్స్ కూడా సోషల్ మీడియా కంటెంట్‌లో భాగమయిపోయారు. ముఖ్యంగా యంగ్ క్రికెటర్స్‌పై పలు రకాల రూమర్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే రవీంద్ర జడేజా.. తన గురించి విన్న విచిత్రమైన రూమర్ ఏంటి అనే ప్రశ్న తనకు ఎదురయ్యింది.

ఐపీఎల్ 2022 తర్వాత మీరు టీ20 వరల్డ్ కప్‌లో భాగమవ్వలేకపోతున్నారని రూమర్స్ వచ్చాయి. దీనిపై మీ స్పందన ఏంటని జడేజాను అడిగారు. అప్పుడు జడేజా 'నేను వరల్డ్ కప్‌లో భాగమవ్వడం లేదనే రూమర్ చాలా చిన్నది. ఒకసారి ఏకంగా నేను చనిపోయాననే రూమర్ వైరల్ అయ్యింది. ఇంక దానికి మించిన రూమర్ ఏముంటుంది. నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించను, గ్రౌండ్‌లో ఎలా ఆడాలి అన్నదానిపైనే నా ఫోకస్ ఉంటుంది' అని సమాధానం ఇచ్చాడు.

Tags

Next Story