RCB: మ్యాచ్‌లో ఓడినా సోషల్ మీడియాలో గెలిచిన ఆర్‌సీబీ.. ట్విటర్‌లో రికార్డ్..
RCB: ఐపీఎల్లోతొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. 15వ సీజన్ కప్పును కొట్టేసింది. అయితే విజేతగా నిలిచినా గుజరాత్ టైటాన్స్ మాత్రం సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న జట్టుగా స్థానం దక్కించుకోలేదు. ఈ సీజన్‌లో అత్యధికంగా నెటిజన్లు సెర్చ్ చేసిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అలాగే అభిమానులు ఎక్కువగా చర్చించున్న ప్లేయర్లలో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.
రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులను ఐపీఎల్15వ సీజన్ఉర్రూతలూగించింది. లీగ్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే ఫైనల్చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన గుజరాత్టైటాన్స్.. అద్భుతంగా ఆడి విజేతగా నిలిచింది. ఆరంభ సీజన్‌లో టైటిల్ గెలిచిన రాజస్థాన్రాయల్స్కు ఈసారి నిరాశే ఎదురైంది. మరోవైపు అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు జట్టు క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో ఆర్‌ఆర్ చేతిలో ఓటమిపాలైంది. కానీ, ట్విట్టర్‌లో మాత్రం అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా బెంగళూరు నిలిచింది. దీంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
ట్విట్టర్‌లో ఆర్సీబీ జట్టుతో పాటు ఆ టీమ్మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్నారని ట్విట్టర్అధికారికంగా వెల్లడించింది. 2022 ఐపీఎల్సీజన్లో ఆర్సీబీపై అత్యధికంగా ట్వీట్లు చేశారు నెటిజన్లు. బెంగళూరు తర్వాత స్థానాల్లో చెన్నై సూపర్కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్రాయల్స్జట్లు నిలిచాయి. ఇక నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్న ఆటగాళ్లలో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ నిలవగా, తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, డుప్లెసిస్ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com