కోహ్లీ కళాత్మక ఇన్నింగ్స్‌కు తోడయిన పడిక్కల్‌ దూకుడు

కోహ్లీ కళాత్మక ఇన్నింగ్స్‌కు తోడయిన పడిక్కల్‌ దూకుడు

విరాట్‌ కోహ్లీ కళాత్మక ఇన్నింగ్స్‌కు దేవదత్ పడిక్కల్‌ దూకుడు తోడు కావడంతో బెంగళూరు ఖాతాలో మరో విజయం నమోదైంది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. చాహల్‌ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం చేధనకు దిగిన బెంగళూరు.. 19.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో బెంగళూర్‌ మొదటి స్థానానికి చేరింది.

Tags

Next Story