Rishabh-Urvashi: పంత్ కోసం పాకులాడుతోన్న బ్యూటీ.. గుర్రుమంటున్న ఫ్యాన్స్
ప్రముఖ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కొన్ని రోజుల క్రితం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖాండ్ ప్రభుత్వం డెహరాడున్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించింది. తాజాగా అతన్ని బీసీసీఐ అక్కడి నుంచి ముంబయిలోని అంబాని ఆసుపత్రికి ఏయిర్ అంబులెన్స్‌లో తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంబాని ఆసుపత్రిలో తను ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం లేస్తుంది. ఆమె పెట్టిన పోస్ట్‌కు పంత్ అభిమానులు మండిపడుతున్నారు. పంత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం చీప్ పబ్లీసిటీ అని అంటున్నారు. కొందరేమో ఇందులో తప్పేముంది తాను సహజంగానే పోస్ట్ చేసిందని మద్దతు తెలుపున్నారు. మరికొదరేమో తాను రిషబ్‌ను మానసికంగా వేదిస్తుందని ఆమెపై కేసు పెట్టాలని అంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com