Rohit Sharma: విరాట్ ఎలాంటి కెప్టెన్ అంటే..? రోహిత్ శర్మ హాట్ కామెంట్స్..

Rohit Sharma: వన్డే కెప్టెన్సీ విరాట్ కోహ్లీ నుండి రోహిత్ శర్మకు వచ్చినప్పటి నుండి టీమిండియా అంతా సైలెంట్ అయిపోయింది. కెప్టెన్సీ విషయం గురించి ఎవరూ పెద్దగా స్పందించట్లేదు. సైలెంట్‌గా క్రికెటర్స్ అందరూ సౌతాఫ్రికా టెస్ట్‌కు సిద్ధమయిపోతున్నారు. తాజాగా రోహిత్ శర్మ దీనిపై స్పందించడం సెన్సేషన్ అవుతోంది.
విరాట్ కెప్టెన్సీ గురించి రోహిత్ చాలా గొప్పగా వర్ణించాడు. కోహ్లీతో తాను అద్భుతమైన సమయాన్ని గడిపానని, అందులో ప్రతీక్షణం తనకు గుర్తుండిపోతుందని చెప్పాడు. కెప్టెన్‌గా విరాట్.. టీమ్‌ను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాడని అన్నాడు. విరాట్ కెప్టెన్‌గా ఉన్నంతకాలం టీమ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదని అన్నాడు రోహిత్.
ప్రతి మ్యాచ్‌లో టీమ్ గెలవాలన్న పట్టుదలను ప్లేయర్స్‌లో పెంచాడని రోహిత్ విరాట్ కెప్టెన్సీను పొగడ్తలతో ముంచెత్తాడు. కానీ విరాట్ మాత్రం టెస్ట్ కెప్టెన్సీని కోల్పోయినప్పటి నుండి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండట్లేదు. అసలు విరాట్ దీనిపై ఎలా స్పందిస్తాడు అని తన అభిమానులు మాత్రమే కాదు, క్రికెట్ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com