Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీ అదుర్స్.. టీమిండియాకు అదిరిపోయే విక్టరీ..

Rohit Sharma (tv5news.in)
Rohit Sharma: టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఘన విజయంతో ప్రారంభమయింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 184 పరుగులు చేసింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ జట్టు.. మొదటనుండే విజయం వైపు అడుగులేసిందని స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 56 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ఒక ప్లేయర్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే.
టీ20 వరల్డ్ కప్‌లో నిరాశపరిచిన భారత జట్టు.. టీ20 సిరీస్‌లో దుమ్ము దులిపింది. వేరే జట్టులకు ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అది కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ విక్టరీని సొంతం చేసుకోవడం తన ఫ్యాన్స్‌ను సంతోషించేలా చేస్తోంది. అంతే కాకుండా రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కడం ఈ సంతోషాన్ని డబుల్ చేస్తోంది.
ఇప్పటికీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మూడు సార్లు టీమిండియా టీ20ల్లో ప్రత్యర్థులను వైట్ వాష్ చేసింది. 2017లో శ్రీలంకను, 2018లో వెస్టిండీస్‌ను, ఇప్పుడు న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ధోనీ కెప్టెన్సీలో ఈ రికార్డ్ ఒక్కసారి దక్కితే.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రెండు టీ20ల్లో టీమిండియా ప్రత్యర్థులను వైట్ వాష్ చేసింది.
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ కనబరిచిన ఆటకు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'ను సొంతం చేసుకున్నాడు. సిరీస్ మొత్తం హిట్ మ్యాన్ తన బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. మూడు మ్యాచ్‌లు కలిపి యావరేజ్‌గా 159 పరుగులు చేశాడు రోహిత్. దీంతో పాటు 154 స్ట్రైక్ రేట్‌ను మెయింటేయిన్ చేశాడు కూడా. సిరీస్‌లో 11 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. సిరీస్‌లో టాప్ స్కోర్‌ను సాధించడమే కాకుండా తాను కెప్టెన్‌గా వ్యవహరించిన మొదటి మ్యాచ్‌లోనే టీమిండియాను విజయంవైపు నడిపించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com