Rohit Sharma : టెస్ట్ టీం కెప్టెన్‌‌గా రోహిత్ శర్మ.. బీసీసీఐ ప్రకటన

Rohit Sharma : టెస్ట్ టీం కెప్టెన్‌‌గా రోహిత్ శర్మ.. బీసీసీఐ ప్రకటన
X
Rohit Sharma : ఇండియన్ క్రికెట్ టెస్ట్ టీం కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరును బీసీసీఐ ఖరారు చేసింది..

Rohit sharma : ఇండియన్ టెస్ట్ టీం కెప్టెన్‌‌గా రోహిత్ శర్మ పేరును బీసీసీఐ ఖరారు చేసింది.. త్వరలో శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ నుంచి హిట్ మ్యాన్ టెస్ట్ కెప్టెన్ బాధ్యతలను చేపట్టనున్నాడు. బీసీసీఐ తాజా ప్రకటనతో మూడు ఫార్మాట్ లకి రోహిత్ కెప్టెన్‌‌గా వ్యహరించానున్నాడు. శ్రీలంకతో టెస్ట్, టీ20లకి బుమ్రాను వైస్ కెప్టెన్‌‌గా ప్రకటించింది బీసీసీఐ.. శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు రహానె, పుజారాలకి ఉద్వాసన లభించింది. మార్చి 4 నుంచి తొలి టెస్టు, 12 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఇక ఫిబ్రవరి 24,26,27 తేదిల్లో మూడు టీ20లు జరగనున్నాయి. టీ20లకి విరాట్, పంత్ లకి రెస్ట్ ఇచ్చారు..

శ్రీలంక సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టు : రోహిత్ శర్మ (c), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్, హనుమ విహారి, శుభమాన్ గిల్, రిషబ్ పంత్, KS భరత్, అశ్విన్, రవి జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, బుమ్రా (VC), షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్.



Tags

Next Story