CRICKET: పుజారా కెరీర్ ముగిసినట్లేనా..!

CRICKET: పుజారా కెరీర్ ముగిసినట్లేనా..!

వచ్చే నెలలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే, టెస్ట్ క్రికెట్ సభ్యుల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రటించింది. పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల్లో భారత్ తలపడనుంది. టెస్ట్,వన్డే జట్లకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.

అయితే బీసీసీఐ కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు కూడా తీసుకుంది. జట్టులోకి కొత్తగా ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, రుతురాజ్, ముఖేష్ కుమార్‌లకి చోటివ్వగా, ఆశ్చర్యకరంగా భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారాను స్క్వాడ్‌ నుంచి తప్పించింది. టెస్టుల్లో రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వన్డేల్లో హార్ధిక్ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఆటగాళ్ల ప్రదర్శనే గీటురాయి..

ఇటీవల జరిగిన WTC ఫైనల్‌లో మంచి ప్రదర్శన చేసిన దాదాపు అంతా ఎంపికయ్యారు. IPL తో గాడిలో పడి ఫైనల్‌కు ఎంపికైన వెటరన్ ఆటగాడు రహానే ఉత్తమ ప్రదర్శన చేసి టెస్ట్ జట్టులో స్థానాన్ని నిలుపుకున్నాడు. అయితే ఎన్నో ఏళ్లుగా మంచి ఇన్నింగ్స్‌లు ఇచ్చిన ఛటేశ్వర్ పుజారాను సెలెక్టర్లు ఇప్పుడు తప్పించి విస్మయపరిచారు. ఆ ఫైనల్‌కు ముందు ఫామ్ కోసం ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాడు. అయినప్పటికీ WTC ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 27, 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టెస్ట్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో పుజారా తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడనే ఊహాగానాలు వస్తున్నాయి.

టెస్ట్‌ క్రికెట్‌ ద్వారానే 2010 లో తన అంతర్జాతీయ కెరీర్‌ ఆరంగేట్రం చేసిన ఈ సౌరాష్ట్ర ఆటగాడు పుజారా తన కెరీర్‌లో 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో రికార్డు పేవలంగా ఉంది. 5 వన్డేల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

భారత జట్లు ఇవే..

టెస్టు జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (విసి), కెఎస్ భరత్ (వికె), ఇషాన్ కిషన్ (వికె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్





Tags

Read MoreRead Less
Next Story